హెడ్ కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐగా అశోక్ కు పదోన్నతి
ఉరవకొండ, జూలై 21:
ఉరవకొండ పోలీస్ సర్కిల్ పరిధిలోని అర్బన్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తున్న హెడ్ కానిస్టేబుల్ అశోక్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ గా పదోన్నతి పొందారు. పదోన్నతిపై ఆయన పుట్టపర్తి పోలీస్ స్టేషన్ కు బదిలీ అయ్యారు.
పుట్టపర్తిలో ఏఎస్ఐగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఉరవకొండ, గుంతకల్, తాడిపత్రి తదితర ప్రాంతాల్లో ఆయన చక్కగా విధులు నిర్వర్తించారు. ఉరవకొండ పోలీస్ స్టేషన్ లో రెండు పర్యాయాలు పనిచేశారు.
పనిచేసిన ప్రతిచోటా ప్రజలతో మమేకమై తనదైన ముద్ర వేసుకున్నారు. ముఖ్యంగా పేదలు, బాధితుల పక్షాన నిలబడి సేవలందించే వ్యక్తిగా గుర్తింపు పొందారు.
ఏఎస్ఐగా పదోన్నతి పొందిన అశోక్ మరిన్ని పదోన్నతులు పొందాలని, ఇదే అంకితభావంతో విధులు నిర్వర్తించాలని సీనియర్ రిపోర్టర్ మాలపాటి శ్రీనివాసులు, ఆర్టీఐ యాక్టివిస్ట్ మీనుగ మధుబాబు ఒక సంయుక్త ప్రకటనలో ఆకాంక్షించారు.