.
ఉరవకొండ, జూలై 29: ఆషాఢ పౌర్ణమి, గురు పౌర్ణమి సందర్భంగా ఉరవకొండలోని శ్రీశ్రీశ్రీ దుర్గాభవాని దేవాలయంలో ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ దుర్గాభవాని అమ్మవారు శ్రీ శాకంబరీ దేవి అలంకారంలో భక్తులకు దివ్య దర్శనం ఇచ్చారు.
ఉదయం అమ్మవారికి పంచామృతాభిషేకంతో పాటు విశేష సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం కాయగూరలు, పండ్లు, ఆకుకూరలతో శాకంబరీ దేవిగా ప్రత్యేక అలంకరణ చేశారు. ఈ అలంకరణకు మీనాక్షి మొబైల్స్ యాజమాన్యం, చిద్దిలా గారు, ఛాయాదేవి గారు, స్వర్ణలత గారు, శాంతి గారు, బాలాజీ గారు, మనోహర్ గారు, ప్రవీణ్ గారు, దత్తరాజు గారు, జీవన్ నాయుడు గారు తదితర భక్తులు కాయగూరలు, పండ్లు, ఆకుకూరలు సమర్పించి తమ వంతు సహకారం అందించారు.
భక్తురాలు ఎం. రామాంజనమ్మ అమ్మవారికి వెండి కిరీటాన్ని కానుకగా సమర్పించారు. అలాగే పలువురు భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు, అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు, వారి కుటుంబ సభ్యులకు సంపూర్ణ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, మనశ్శాంతి కలగాలని శ్రీ దుర్గాభవాని అమ్మవారిని ఆలయ కమిటీ సభ్యులు, శ్రీ భవాని భక్త మండలి సభ్యులు ప్రార్థించారు..


