ఉరవకొండలో అక్రమాలపై జూలై 31న మహాధర్నా: వైఎస్సార్‌సీపీ


 

అనంతపురం జులై 28:

అనంతపురం జిల్లా వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఉరవకొండ నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి, భూ ఆక్రమణలు, హంద్రీ-నీవా కాలువ పనుల్లో అవకతవకలు, పేకాట క్లబ్బులు, బెల్ట్ షాపుల నిర్వహణ తదితర అంశాలపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సమస్యలకు నిరసనగా ఈ నెల 31న ఉరవకొండ ఎమ్మార్వో కార్యాలయం ఎదుట మహాధర్నా నిర్వహించనున్నట్లు ప్రకటించారు.


ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజేష్‌పై విమర్శలు చేస్తూ, టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలపై స్పందించకుండా, వైఎస్సార్‌సీపీ చేపట్టిన నిరసన కార్యక్రమాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వేల్పుమడుగు భూముల వివాదం, ప్రభుత్వ భూముల పరిరక్షణ, దేవాలయ భూముల అంశాల్లో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని, కోర్టు ఉత్తర్వులు, అధికారుల వైఖరిపై కూడా ప్రశ్నలు లేవనెత్తారు.

విలేకరుల సమావేశంలో రాయలసీమ జోనల్ అధికార ప్రతినిధి కె.వి. రమణ, మాజీ పీపీ హరినాథ్ రెడ్డి, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు కురుబ దేవేంద్ర, కురుబ గోవిందు, కురుబ సురేష్, బెస్త తిరుపాల్ తదితరులు పాల్గొన్నారు.