ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్‌లో ఉరవకొండ యువ నాయకుడు బోయ రమేష్ విజయం



 


ఉరవకొండ,జులై 19: 

ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ (AIBE) ఫలితాల్లో ఉరవకొండ మండలం చిన్నమూస్టూరు గ్రామానికి చెందిన బోయ రమేష్ ఉత్తీర్ణత సాధించారు.


బోయ రమేష్ గతంలో ఏబీవీపీ మాజీ విద్యార్థి నాయకుడిగా, బీజేపీ యువజన విభాగం మాజీ రాష్ట్ర నాయకుడిగా పనిచేయగా, ప్రస్తుతం బీజేపీ జిల్లా గుడ్ గవర్నెన్స్ కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.


బీకాం, ఎంకాం, ఎల్‌ఎల్‌బీ విద్యార్హతలు కలిగిన ఆయన ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్‌లో ఉత్తీర్ణత సాధించడంతో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసేందుకు అర్హత పొందారు.

ఈ సందర్భంగా బోయ రమేష్ మాట్లాడుతూ, ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసిన తర్వాత న్యాయవాదిగా సేవలందించాలన్న తన లక్ష్యం నెరవేరిందని తెలిపారు. ఇకపై కుల, మత, వర్గ భేదాలకు అతీతంగా పేద ప్రజలకు చట్టపరమైన సహాయం అందిస్తూ, సమర్థవంతంగా న్యాయ సేవలు అందించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.