8వ జగద్గురువుకు బీజేపీ నేతల ఘన నివాళి



 


ఉరవకొండ  జులై 19:

గవి మఠం 8వ పీఠాధిపతి, జగద్గురువు శ్రీ చెన్న బసవ రాజేంద్ర మహాస్వామి (98) అనారోగ్యంతో బళ్లారిలో కన్నుమూశారు.

స్వామివారి పార్థివదేహాన్ని ఉరవకొండలోని కరిబసవ గవి మఠ సంస్థానంకు తీసుకువచ్చారు. స్వామివారి పార్థివదేహానికి బీజేపీ నేతలు నివాళులర్పించారు.

స్వామివారి ఆత్మకు శాంతి చేకూరాలని బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర కార్యదర్శి మూడ్ కేశవ నాయక్, బీజేపీ సీనియర్ నాయకుడు లాలెప్ప శ్రద్ధాంజలి ఘటించారు.