పంచాయతీరాజ్, అటవీ శాఖలపై పవన్ చర్చ

 



రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు శనివారం శాఖాపరమైన చర్చలు చేపట్టారు. శస్త్ర చికిత్స అనంతరం వైద్యుల సూచనల మేరకు విశ్రాంతిలో ఉన్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు తన శాఖలకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ఇందులో భాగంగా పంచాయతీరాజ్, అటవీ శాఖల ముఖ్య కార్యదర్శి శ్రీ కాంతిలాల్ దండేతో శనివారం హైదరాబాద్ లో సమావేశమయ్యారు. పంచాయతీరాజ్ శాఖలో నిర్దేశించిన పనుల పురోగతిపై చర్చించారు. వర్షా కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగు పారిశుధ్య చర్యలు చేపట్టాలని, రక్షిత మంచినీరు సరఫరాపై దృష్టి సారించాలని ఆదేశించారు.