ఎస్‌ఐఆర్‌ ఓటరు నమోదు గడువు పొడిగించాలి


 

యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ సి. జాఫర్

 ఉరవకొండ జులై 9:

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్‌) ఓటరు నమోదు ప్రక్రియ గడువును ప్రభుత్వం వెంటనే పొడిగించాలని యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ (యూజేఏసీ) కన్వీనర్ సి. జాఫర్ కోరారు. గురువారం ఉరవకొండలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ 2002 ఓటరు జాబితాలో పేరు లేకపోయినా ఆధార్ కార్డు, మరియు చెల్లుబాట అయ్యే ఆధారాలతోనే ఏన్యుమురేషన్ ధ్రువపత్రాలను జతచేసి ఓటరు నమోదుకు మ్యాపింగ్ చేసుకునేలా ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జిల్లా కలెక్టర్ ఆనంద్ అనుమతి ఇవ్వడం అభినందనీయమన్నారు. అయితే, అధికార వర్గాల అంచనా ప్రకారం అనంతపురం జిల్లా వ్యాప్తంగా దాదాపు 2.26 లక్షల ఓట్లు జాబితా నుంచి తప్పిపోయే ప్రమాదం ఉందని విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతోందన్నారు. పలు దినపత్రికలు కూడా నియోజకవర్గాల వారీగా ఓటర్ల సంఖ్య తగ్గే అవకాశాలను శాతాలు, గణాంకాలతో ప్రచురిస్తున్నాయని పేర్కొన్నారు.

జిల్లా యంత్రాంగం, బీఎల్‌వోలు, ప్రభుత్వ ఉద్యోగులు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతంగా నిర్వహిస్తున్నప్పటికీ, నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవడం కష్టంగా మారిందన్నారు. ఈ నేపథ్యంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటరు నమోదుకు అవకాశం కల్పించేలా ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ గడువును ప్రభుత్వం వెంటనే పొడిగించాలని సి. జాఫర్ డిమాండ్ చేశారు.