రాయలసీమ హక్కుల పరిరక్షణ ధర్నాకు యూఎస్‌ఎఫ్‌ఐ మద్దతు


 

అనంతపురం  జులై 9:

అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట రాయలసీమ విద్యావంతుల వేదిక, అనంత హక్కుల పోరాట సంఘం ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ధర్నా కార్యక్రమానికి యునైటెడ్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (USFI) అనంతపురం జిల్లా కమిటీ సంఘీభావం ప్రకటించింది.

ఈ కార్యక్రమంలో యూఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి భీమేష్, నాయకులు సుంక నాయక్‌తో పాటు ఇతర సభ్యులు పాల్గొని ధర్నాకు మద్దతు తెలిపారు.