పెన్నహోబిలం, జూలై 22:
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం, పెన్నహోబిలం నందు 2026-27 సంవత్సరానికి గాను టెంకాయలు విక్రయించుకునే హక్కు మరియు కొబ్బరి చిప్పలు సేకరించుకునే హక్కులకు సీల్డ్ టెండర్ కం బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి తెలిపారు.
ఈ వేలం పాట ఈ నెల 30వ తేదీ (30-07-2026) ఉదయం 11:00 గంటలకు దేవస్థానం ఆవరణలో జరుగుతుంది.
దేవాదాయ ధర్మాదాయ శాఖ పర్యవేక్షణ అధికారి పర్యవేక్షణలో, ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ రేగటి నాగరాజు గారు మరియు ధర్మకర్తల మండలి సభ్యుల సమక్షంలో ఈ వేలం ప్రక్రియ నిర్వహించబడుతుంది.
వేలంలో పాల్గొనదలచిన పాటదారులు తమ గుర్తింపు కోసం ఆధార్ కార్డు జిరాక్స్ కాపీని తప్పనిసరిగా వెంట తీసుకురావాలని, ఇతర వివరాలకు పనివేళల్లో దేవస్థాన కార్యాలయాన్ని సంప్రదించాలని EO తెలిపారు.