సీఎంసీ ఎస్‌కే ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో అమరావతి చాంపియన్స్‌షిప్‌కు సంబంధించిన నియోజకవర్గ స్థాయి క్రీడాకారుల ఎంపికలు ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ ఎంపికల్లో నియోజకవర్గంలోని ఏడు మండలాలకు చెందిన దాదాపు 390 మంది బాలబాలికలు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు.
కార్యక్రమాన్ని ఎంపీడీవో రవీప్రసాద్, జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి (DSDO) ముంజాల, తెలుగుదేశం పార్టీ నాయకులు ప్యారం కేశవ, సిద్ధప్ప, ఎంకేటి ఈశ్వరప్ప, ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ, జిల్లా క్రీడా సంఘ శిక్షకులు, వ్యాయామ ఉపాధ్యాయులు సంయుక్తంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు క్రీడాకారులను పరిచయం చేసుకుని, క్రీడాస్ఫూర్తితో పోటీల్లో పాల్గొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ప్రోత్సహిస్తూ ప్రసంగించారు.