NEET పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలి!*

*

రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్ జయప్రదం చేయండి — USFI ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ పిలుపు*

 అనంతపురం నగరం లో ఈరోజు యునైటెడ్ స్టూడెంట్స్ ఫెడరేషన్ అఫ్ ఇండియా (USFI) ఆధ్వర్యంలో పత్రిక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా USFI జిల్లా కార్యదర్శి భీమేష్ మాట్లాడుతూ.....దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న NEET UG పేపర్ లీకేజీ, నిర్వహణ వైఫల్యాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని యునైటెడ్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (USFI) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తోంది అన్నారు అలాగే 
గత రెండు రోజులుగా దేశ రాజధాని ఢిల్లీ వీధులలో విద్యార్థుల పై జరిగిన దమనకాండ ను నిరసిస్తూ 24 న ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ కు యునైటెడ్ స్టూడెంట్స్ ఫెడరేషన్ అఫ్ ఇండియా (USFI) పిలుపునిచ్చింది.