ఉరవకొండ అసెంబ్లీ NWC కన్వీనర్‌గా మఠం అశోక్ చక్రవర్తి నియామకం

 



ఉరవకొండ జులై 19:


నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ (NWC) ఉరవకొండ అసెంబ్లీ కన్వీనర్‌గా మఠం అశోక్ చక్రవర్తిని నియమించారు. జాతీయ చైర్మన్ రాహుల్ ద్వివేది మార్గదర్శకత్వంలో, రాష్ట్ర చైర్మన్ అంబటి నవకుమార్ నాయకత్వంలో, జిల్లా చైర్మన్ తోట సూర్య ప్రకాష్ రెడ్డి ఈ నియామకాన్ని ప్రకటించారు.


ఈ సందర్భంగా అశోక్ చక్రవర్తి మాట్లాడుతూ, తనపై ఉంచిన నమ్మకానికి సంస్థ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ, అటవీ సంరక్షణ, వాతావరణ మార్పులపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు కృషి చేస్తానన్నారు. అలాగే మొక్కల నాటడం, పరిశుభ్రత, నీటి సంరక్షణ వంటి కార్యక్రమాలను పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ లక్ష్యాలకు అనుగుణంగా విస్తృతంగా నిర్వహిస్తామని తెలిపారు.


ఉరవకొండ అసెంబ్లీ పరిధిలో యువత, విద్యార్థులు, మహిళలు, అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చేస్తూ పర్యావరణ పరిరక్షణపై విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు.


ఈ బాధ్యత అప్పగించిన జాతీయ, రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి అశోక్ చక్రవర్తి ధన్యవాదాలు తెలిపారు.