ఘనంగా మన జన ప్రగతి ఎండి డా. వివేకానంద రెడ్డి యాదవ్ కి సన్మానం.



 పులివెందుల వైఎస్సార్ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం


పులివెందుల:

స్థానిక వైఎస్సార్ ప్రెస్ క్లబ్ (ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా) నూతన కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి క్లబ్ ప్రతినిధులు, జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

సరికొత్తగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు ఈ వేడుకలో అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా పలువురు సీనియర్ పాత్రికేయులు మాట్లాడుతూ.. జర్నలిస్టుల సంక్షేమానికి, సమస్యల పరిష్కారానికి నూతన కమిటీ కట్టుబడి పనిచేయాలని ఆకాంక్షించారు. అనంతరం నూతన బాధ్యతలు స్వీకరించిన ప్రతినిధులను, డాక్టర్ వివేకానంద రెడ్డి యాదవ్ లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.