త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ధైర్యం చెప్పిన రాందాస్ చౌదరి, శ్రీరామ్ చినబాబు
మదనపల్లె, ఆగస్టు 8: గత నెలలో గాయపడిన సీనియర్ రిపోర్టర్ యుగంధర్ (చిన్న)ను జనసేన పార్టీ రాయలసీమ కో-కన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి, రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు శనివారం పరామర్శించారు.
గాయాల కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందిన యుగంధర్ ఇటీవల డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న రాందాస్ చౌదరి, శ్రీరామ్ చినబాబు యుగంధర్ నివాసానికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా యుగంధర్‌తో మాట్లాడిన నాయకులు ఆయనకు ధైర్యం చెప్పారు. త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు. ఎలాంటి ఆందోళన చెందవద్దని, అవసరమైన సమయంలో అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.సీనియర్ రిపోర్టర్‌గా యుగంధర్ అందిస్తున్న సేవలను గుర్తుచేసుకున్న నాయకులు, ఆయన త్వరగా కోలుకుని తిరిగి తన విధుల్లో చురుగ్గా పాల్గొనాలని ఆకాంక్షించారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో యాలగిరి దొరస్వామి నాయుడు, ఖాన్ తదితరులు పాల్గొని యుగంధర్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
