అనంతపురం ఆగస్టు08:- రాయదుర్గం పట్టణంలోని ముత్తరాశి కాలనీలో నివాసం ఉంటున్న యం. కృష్ణప్ప ఇటీవల గుండెపోటుతో మృతి చెందడం బాధాకరమని ఆర్ఇఎఫ్ డిస్ట్రిక్ట్ వర్కింగ్ ప్రెసిడెంట్, హెడ్ కానిస్టేబుల్ చంద్రగిరి వెంకటనారాయణ అన్నారు. కృష్ణప్ప ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలో ఆఫీస్ బాయ్‌గా పనిచేసేవారు. 1996లో తాను రాయదుర్గం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలో మొదటి పోస్టింగ్‌లో చేరినప్పటి నుంచి కృష్ణప్ప తనకు, తన కుటుంబ సభ్యులకు పరిచయస్తుడని వెంకటనారాయణ తెలిపారు. మంచి వ్యక్తిని కోల్పోవడం ఎంతో బాధాకరమన్నారు. ఈ సందర్భంగా చంద్రగిరి వెంకటనారాయణ భార్య అనంతపురం జిల్లా యాదవ సంఘం మహిళా అధ్యక్షురాలు చంద్రగిరి రాధ యాదవ్‌తో కలిసి కృష్ణప్ప స్వగృహానికి వెళ్లి ఆయన భార్య, కుమార్తెలు, అల్లుళ్లను పరామర్శించారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుని, తమ వంతు సహాయాన్ని అందించారు. కుటుంబానికి ఎలాంటి అవసరం వచ్చినా తమ వంతు అండగా ఉంటామని చంద్రగిరి దంపతులు భరోసా ఇచ్చారు.
3/related/default
