పుట్టపర్తి, ఆగస్టు 9: మెగా యూత్ ఫోర్స్ పుట్టపర్తి నియోజకవర్గ అధ్యక్షుడిగా బోయ వంశీ నియమితులయ్యారు. ఈ మేరకు సంస్థ ప్రతినిధులు ఆయనకు బాధ్యతలు అప్పగించారు.
నియోజకవర్గ అధ్యక్షుడిగా తనను నియమించిన మెగా యూత్ ఫోర్స్ వ్యవస్థాపకురాలు కొణిదల సుస్మిత, రాష్ట్ర చిరంజీవి యువత అధ్యక్షుడు భవానీ రవికుమార్, రాయలసీమ కన్వీనర్ చక్రి, జిల్లా అధ్యక్షుడు హుస్సేన్‌కు బోయ వంశీ కృతజ్ఞతలు తెలిపారు.
తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి సంస్థకు మంచి పేరు తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని వంశీ పేర్కొన్నారు. మెగా ఫ్యామిలీ స్ఫూర్తితో పుట్టపర్తి నియోజకవర్గంలో మరిన్ని సేవా కార్యక్రమాలను చేపడతామని తెలిపారు.
యువతను సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేస్తూ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించేందుకు కృషి చేస్తానని ఆయన అన్నారు. తన నియామకానికి సహకరించిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు వంశీ ధన్యవాదాలు తెలిపారు.
