మృతులను మల్లా ప్రవీణ్ కుమార్, అతని భార్య మరియు ఇద్దరు పిల్లలుగా స్థానికులు గుర్తించారు. వీరంతా ఒకేసారి బలవన్మరణానికి పాల్పడటానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
సమాచారం అందుకున్న పెందుర్తి పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
కాగా, ఇటీవల శ్రీశైలంలో కూడా ఒకే కుటుంబం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మరువకముందే ఏపీలో మరో కుటుంబం ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది.
