![]() |
| పాళ్లూరు గ్రామంలో మారెమ్మ దేవి ఆలయ నిర్మాణానికి రూ.లక్ష విరాళాన్ని అందిస్తున్న ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు. |
కంబదూరు, సెప్టెంబర్ 26: అనంతపురం జిల్లా కంబదూరు మండలం పాళ్లూరు గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న మారెమ్మ దేవి ఆలయానికి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు రూ.1,00,000 విరాళంగా అందించారు.
గ్రామంలో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో గ్రామస్తులకు ఈ మొత్తాన్ని అందజేశారు. నూతనంగా నిర్మిస్తున్న మారెమ్మ దేవి ఆలయ నిర్మాణానికి తన వంతు సహకారంగా ఈ విరాళాన్ని అందించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ నిర్మాణానికి సహకరించినందుకు అభినందనలు తెలియజేశారు.
