మహిళల ఆర్థిక స్వావలంబనకు ఆర్‌డీటీ చేయూత

డ్రైవింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న 22 మంది మహిళలకు ఆటోలు పంపిణీ

అనంతపురం: మహిళలు స్వయం ఉపాధి పొందుతూ ఆర్థికంగా ఎదిగేందుకు రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ (RDT) చేపట్టిన ఆటో డ్రైవింగ్ కార్యక్రమంలో భాగంగా 22 మంది మహిళలకు ఆటోరిక్షాలను అందజేశారు. నెల రోజుల పాటు డ్రైవింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు ఈ ఆటోలను అందించారు.

గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఒంటరి తల్లులకు జీవనోపాధి కల్పించడమే లక్ష్యంగా RDT ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. డ్రైవింగ్ శిక్షణతో పాటు మహిళలకు ఆత్మరక్షణ, రహదారి భద్రత, రోడ్డు నిబంధనలపై అవగాహన, వ్యక్తిత్వ వికాసం, కౌన్సెలింగ్ తదితర అంశాల్లో శిక్షణ అందించారు.

ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు 45 మంది మహిళలకు ఆటోలు అందించి స్వయం ఉపాధి అవకాశాలను కల్పించినట్లు ఆర్డిటీ ప్రతినిధులు తెలిపారు. ఆటో డ్రైవింగ్ ద్వారా మహిళలు తమ కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలవడంతో పాటు స్వతంత్రంగా జీవించే అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు.

కార్యక్రమంలో ఆర్డిటీ  సహ వ్యవస్థాపకురాలు Anne Ferrer, ప్రోగ్రామ్ డైరెక్టర్  మంచో ఫెర్రెర్, విష ఫెర్రెర్, అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.


మహిళల్లో నైపుణ్యాలను పెంపొందించి, ఆత్మవిశ్వాసాన్ని పెంచడంతో పాటు కుటుంబాలు, గ్రామీణ సమాజాలను బలోపేతం చేయడమే ఆర్డి టీ  మహిళా సాధికారత కార్యక్రమం లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.