యాడికి, ట్రూ టైమ్స్ ఇండియా:
యాదికి మండలం సామాజికవేత్త, డాక్యుమెంట్ రైటర్ జూటూరు అబ్దుల్ రజాక్ రెండవ కుమారుడు జూటూరు ఫిరోజ్ ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ ఎగ్జామినేషన్‌లో ఉత్తీర్ణత సాధించి, ఈ నెల 12 తేదీన అమరావతి హైకోర్టులో అడ్వకేట్‌గా ఎన్‌రోల్‌మెంట్ పట్టా పొందారు. ఈ సందర్భంగా జూటూరు ఫిరోజ్ సాధించిన ఈ ఘన విజయంపై ఆయన తల్లిదండ్రులు, జూటూరు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. గత ఏడాది పెద్ద కుమారుడు జూటూరు అర్షద్ డాక్టర్‌గా, ఇప్పుడు రెండవ కుమారుడు జూటూరు ఫిరోజ్ అడ్వకేట్‌గా పట్టా పొందడం తమ కుటుంబానికి ఎంతో గర్వకారణమని, తమకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. జూటూరు ఫిరోజ్ న్యాయవాద వృత్తిలో ఉన్నత శిఖరాలను అధిరోహించి, సమాజానికి తన వంతు సేవ అందించాలని కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు ఆకాంక్షించారు.
