కలగళ్ల బీసీ కాలనీలోని లక్ష్మీ గణపతి లడ్డూ కురుభ

లక్ష్మీ గణపతి లడ్డు గోపాల్‌ కైవసం

హోరా హోరీగా సాగిన లడ్డు వేలం పాట

కలగళ్ల గ్రామంలోనే రికార్డు ధర పలికిన లక్ష్మీ గణపతి లడ్డు వేలం ధర 27100 రూపాయలు

భక్తులందరి సమక్షం లోనే కమిటీ వారికి నగదును అందచేసిన కురుబ గోపాల్

కూడేరు సెప్టెంబర్ 17(మనం న్యూస్):మండల పరిధిలోని కలగళ్ల గ్రామంలో వినాయక నిమజ్జన కార్యక్రమం కన్నుల విందుగా జరిగింది.మరి ముఖ్యంగా స్థానిక బీసీ కాలనీ లోని బృందావన కాలనీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యం లో 3రోజుల పాటు కాలనీ వాసులంతా ఐకమత్యం తో భక్తి శ్రద్ధలతో గణనాథుని పూజించారు.3రోజు నిమజ్జన కార్యక్రమం లో భాగంగా గణపతి బప్పా మోరియా నినాదాలతో కలగళ్ల గ్రామం మారుమోగిపోయింది. వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల ముగింపు వేళ, స్థానిక బీసీ కాలనీలోని లక్ష్మీగణపతి మండపంలో నిర్వహించిన లడ్డూ వేలం పాట అత్యంత రసవత్తరంగా సాగింది. కాలనీ భక్తుల మధ్య తీవ్ర ఉత్కంఠ రేపిన ఈ హోరాహోరీ వేలంలో, చివరి నిమిషం వరకు పట్టుదలతో పోరాడి కురుభ గోపాల్ లక్ష్మీగణపతి లడ్డూను రూ. 27,100 (ఇరవై ఏడు వేల వంద రూపాయల) భారీ మొత్తానికి దక్కించుకున్నారు. 

భక్తుల సమక్షంలో హోరాహోరీ పోటీ!

నవరాత్రుల పొడుగునా విశేష పూజలందుకున్న ఈ లక్ష్మీ గణపతి లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకుంటే కుటుంబానికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయనే నమ్మకంతో వేలం పాట ప్రారంభం కాగానే కాలనీ భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఒకరిని మించి మరొకరు పట్టుదలతో పాటను పెంచుకుంటూ పోవడంతో వాతావరణం అంతా వేడెక్కింది కాలనీ భక్తుల సమక్షంలో నగదు చెల్లింపు!

పోటీ తీవ్రంగా మారుతున్నా ఎక్కడా వెనకడుగు వేయకుండా, గట్టి పట్టుదలతో నిలిచిన కురుభ గోపాల్ చివరికి రూ. 27,100 పలికి లడ్డూను కైవసం చేసుకున్నారు. అనంతరం, కాలనీలోని భక్తులందరి సమక్షంలోనే లడ్డూ వేలం పాట నగదును ఉత్సవ కమిటీ సభ్యులకు అక్కడికక్కడే అందజేశారు. నగదు స్వీకరించిన కమిటీ సభ్యులు కురుభ గోపాల్‌ను శాలువాతో సత్కరించి, భక్తజన హర్షాతిరేకాల మధ్య స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని బహూకరించారు.

ఆనంద డోలికల్లో విజేత

లడ్డూను గెలుచుకున్న అనంతరం కురుభ గోపాల్ మాట్లాడుతూ.. కాలనీ భక్తులందరి సమక్షంలో స్వామివారి కృపతో ఈ లక్ష్మీ గణపతి లడ్డూ ప్రసాదం తనకు దక్కడం పూర్వజన్మ సుకృతమని, ఈ ప్రసాదం తమ కుటుంబానికి సుఖసంతోషాలు ప్రసాదిస్తుందని ఎంతో భక్తిభావంతో ఆనందం వ్యక్తం చేశారు. కలగళ్ల గ్రామం బీసీ కాలనీలో జరిగిన ఈ లడ్డూ వేలం పాట స్థానికంగా పెద్ద చర్చనీయాంశంగా నిలిచింది.