ఉరవకొండ, సెప్టెంబర్ 30:
ఉరవకొండ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ సీడీపీఓ బి.ఎన్. శ్రీదేవి ఆదేశాల మేరకు హాగళగి గ్రామంలో "పోషణ మాసం" అవగాహన కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఐసీడీఎస్ సూపర్ వైజర్ బి. పుష్పావతి ఆధ్వర్యంలో ఈ సదస్సు జరిగింది.
ఈ సందర్భంగా సూపర్ వైజర్ బి. పుష్పావతి మాట్లాడుతూ — పిల్లలు, గర్భిణులు, బాలింతలు మరియు కౌమారదశ బాలికల్లో పోషకాహార లోపాన్ని నివారించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. సరిపడా పోషకాలు అందకపోవడం వల్ల పిల్లల్లో రక్తహీనత పెరుగుతుందని, తద్వారా పలు రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని హెచ్చరించారు. వీటిని నివారించేందుకు రోజూవారీ ఆహారంలో పాలు, గుడ్లు, పప్పుధాన్యాలు, మాంసం, ఆకుకూరలు, కూరగాయలు మరియు పండ్లతో కూడిన "సమతుల్య పౌష్టికాహారాన్ని" తప్పనిసరిగా భాగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక అంగన్వాడీ టీచర్లు, ఆశా (ASHA) వర్కర్లు, ఏఎన్ఎం (ANM)లు, గ్రామ పెద్దలు మరియు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
