– తహశీల్దార్‌కు మాలమహానాడు వినతి
ఉరవకొండ సెప్టెంబర్ 10:
వర్షాభావ పరిస్థితుల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద రైతులకు ప్రభుత్వం తరఫున ఉచితంగా పశుగ్రాసం పంపిణీ చేయాలని మాలమహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు మొలక బాలరామాంజనేయులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఉరవకొండ మండల తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అనంతపురం జిల్లా వ్యాప్తంగా సరైన వర్షాలు లేక తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాభావం కారణంగా పొలాల్లో మేత లేక పేద రైతులు తమ ఆవులు, గేదెలు మరియు ఇతర పశువులను పోషించుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
పశువుల ఆకలి కేకలను గుర్తించి, తక్షణమే స్పందించాలని కోరారు. తహశీల్దార్ గారు ఈ సమస్యను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, కరువు ప్రాంతాల్లోని పేద రైతులకు ఉచితంగా (ఫ్రీగా) పశుగ్రాసాన్ని సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో మాలమహానాడు నాయకులు B. మోహన్, M. శివ, P. రాంబాబు, G. రామాంజినేయులు తదితరులు పాల్గొన్నారు.
