ఉరవకొండ సెప్టెంబర్ 10:
ఐసీ డీ యస్ ప్రాజెక్ట్ (ఉరవకొండ) సీడీ
పీఓ B. పుష్పవతి విడపనకల్లు మండలం, పాల్తూరు గ్రామ పరిధిలోని 1, 4, 7 అంగన్‌వాడీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ తనిఖీలో భాగంగా ప్రీ-స్కూల్ నిర్వహణ, పోషకాహార పంపిణీ, పిల్లల బరువులు మరియు తక్కువ బరువు ఉన్న పిల్లల వివరాలను లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం 9వ జాతీయ పోషణ మాసంలో భాగంగా పోషకాహారం, బాల్యవివాహాల నిరోధకత, పిల్లల పెరుగుదల-బరువులు మరియు రక్తహీనత నివారణపై అవగాహన సమావేశం నిర్వహించారు.
అనంతరం పాల్తూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం) నందు గర్భవతులకు పోషకాహారం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.
పాల్గొన్న ప్రతినిధులు:
* గ్రామ పెద్దలు
* వైద్యులు/ఆరోగ్య సిబ్బంది: డాక్టర్ సునీత మేడమ్, హెల్త్ ఆఫీసర్ యశోధ, సూపర్‌వైజర్ సుధాకర్ (సలీమ, శ్రవణి), ఆశ వర్కర్ (గౌరి కుమారి)
* అంగన్వాడీ టీచర్లు: దుర్గ, లక్ష్మీదేవి, మల్లేశ్వరి, నాగవేణి, రాధ, చంద్రకళ, ఆదిలక్ష్మి తదితరులుపాల్గొన్నారు..
