సంప్రదాయబద్ధంగా గణేష్ ఉత్సవాలు నిర్వహించాలి: ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి.

 



వినాయక చవితి ఉత్సవాలను సంప్రదాయబద్ధంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి అనంతపురం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ విక్రమ్ సూచించారు. ఉరవకొండ పట్టణంలోని మార్కండేయ స్వామి ఆలయంలో ఉరవకొండ గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. గణేష్ మండపాల్లో డీజేలు ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బంది కలిగించవద్దని, భక్తి గీతాలు, భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ఉత్సవాల సందర్భంగా పోలీసులకు పూర్తిగా సహకరించాలని తెలిపారు. గణేష్ మండపాల నిర్వాహకులు భద్రతకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, విద్యుత్‌, అగ్నిప్రమాదాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా, క్రమశిక్షణతో నిర్వహించాలని కోరారు. గణేష్ ఉత్సవాలు భక్తి, ఐక్యత, సమరసతకు ప్రతీకగా నిలిచేలా నిర్వహించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో గణేష్ ఉత్సవ సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి విశ్వేశ్వరరెడ్డి, జిల్లా కార్యదర్శి గోపీనాథ్, సభ్యులు గోపి ఆచారి, విజయ్, వాల్మీకి సురేంద్ర, వెంకట్ ఎర్రిస్వామి, శరత్, ధన తదితరులు పాల్గొన్నారు.