ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఇంచార్జ్ కాపు రామచంద్రారెడ్డి తన స్వగ్రామమైన నాగిరెడ్డిపల్లికి చేరుకుని గ్రామస్తులతో కలిసి మారెమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు.
ఈ సందర్భంగా కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. మారెమ్మ అమ్మవారి ఆశీస్సులతో నాగిరెడ్డిపల్లి గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. గ్రామంలో పాడిపంటలు సమృద్ధిగా పండాలని, రైతులు, ప్రజలు సుభిక్షంగా జీవించాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. గ్రామ ప్రజల ఐక్యత, సంప్రదాయాలు కొనసాగాలని కోరుకున్నారు.
మారెమ్మ పండుగ సందర్భంగా గ్రామంలో భక్తులు, మహిళలు, యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. పండుగ కార్యక్రమాలు ప్రశాంతంగా జరిగేలా గ్రామ పెద్దలు, నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.
