పోలీస్ అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించిన ధర్మవరపు మురళి
రాప్తాడు: ఈ నెల 22న జరగనున్న మంత్రి నారా లోకేష్ కార్యక్రమానికి సంబంధించి భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, ఇతర కార్యక్రమ ఏర్పాట్లపై ధర్మవరపు మురళి పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు.
డీఎస్పీ, సీఐతో పాటు ఇతర పోలీసు అధికారులతో కలిసి కార్యక్రమం జరిగే ప్రాంతంలో చేపట్టాల్సిన భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల రాకపోకలు తదితర అంశాలపై చర్చించారు.
కార్యక్రమానికి వచ్చే ప్రజలు, నాయకులు, కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని, పోలీసు శాఖతో సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ నెల 22న రాప్తాడులో ఎన్టీఆర్, పరిటాల రవీంద్ర విగ్రహావిష్కరణ కార్యక్రమం జరగనుండగా, మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరవుతారని ఇప్పటికే సమాచారం వెలువడింది.
