True Times Indiaనిజమైన వార్తలు — నిర్భయమైన రిపోర్టింగ్
True Times India

తాజా తెలుగు వార్తలు | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | జాతీయం

తాజా వార్తతాజా వార్తలు లోడ్ అవుతున్నాయి...

పయ్యావుల శ్రీనివాసులు సమక్షంలో టీడీపీలోకి 30 కుటుంబాలు చేరిక!


 


అనంతపురం, రామ్‌నగర్ | అక్టోబర్ 13:


విడపనకల్ మండలం కడదరబెంచి గ్రామానికి చెందిన 30 కుటుంబాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి. పయ్యావుల శ్రీనివాసులు  సమక్షంలో పార్టీలో చేరిన వారికి ఆయన పసుపు కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.


రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ గారు ఉరవకొండ నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై టీడీపీలో చేరినట్లు వారు తెలిపారు.


ప్రజా సంక్షేమం, గ్రామాల అభివృద్ధి, నియోజకవర్గ ప్రగతికి కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషికి మద్దతుగా నిలుస్తామని వారు పేర్కొన్నారు.


•పార్టీలోకి చేరిన వారు: 

____________________

M. పెద్దిరెడ్డి, M. అమర్నాథ్ రెడ్డి, మాజీ సర్పంచ్ కొడుకు, A. గోపాల్ రెడ్డి, B. ఆంజనేయులు, B. భాస్కర్, K. సీతారాముడు, K. కృష్ణమూర్తి, H. మల్లికార్జున, H. హనుమంతు, K. ప్రసాద్, H. ఉలిగన్న, B. ఎర్రిస్వామి, B. సుంకన్న, C. గాదిలింగ, H. రామచంద్ర, G. యుగంధర్, I. వంశి రెడ్డి, B. రామాంజిని, C. చాకలి సిద్ధప్ప, K. కుమ్మర ఎర్రిస్వామి, K. కమ్మర శివ తదితరులు.


ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నాయకులు మాజీ ఎంపీపీ ప్రతాప్ నాయుడు, గడేకల్ భీమలింగ, గడేకల్ శీనా, సర్పంచ్ దేవరాజ్, కడదరబెంచి భీమలింగ, A చిన్నారెడ్డి, M యోగానంద రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

↑