True Times Indiaనిజమైన వార్తలు — నిర్భయమైన రిపోర్టింగ్
True Times India

తాజా తెలుగు వార్తలు | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | జాతీయం

తాజా వార్తతాజా వార్తలు లోడ్ అవుతున్నాయి...

గవి మఠంలో ఘనంగా గణపతి పూజ, వరుణ యాగం

ఉరవకొండ గవి మఠంలో వరుణ యాగం.. వర్షాలు సమృద్ధిగా కురవాలని ప్రత్యేక పూజలు

ఉరవకొండ, అక్టోబర్ 7: అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని ప్రసిద్ధ శ్రీ గవి మఠం సంస్థానంలో మంగళవారం (అక్టోబర్ 6) ప్రత్యేక పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. లోకకల్యాణం, సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ మఠంలో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.

కార్యక్రమంలో భాగంగా శ్రీ గణపతి పూజ, వరుణ జపం, వరుణ యాగం, పూర్ణాహుతి కార్యక్రమాలను వేద పండితుల ఆధ్వర్యంలో నిర్వహించినట్లు మఠం నిర్వాహకులు తెలిపారు. ప్రత్యేక పూజల్లో భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గవి మఠం స్వాములు, దేవస్థానం సిబ్బంది, మఠం సహాయక కమిషనర్, మేనేజర్ బి. సుధారాణితో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య పూజా కార్యక్రమాలు కొనసాగాయి.

ప్రత్యేక పూజల అనంతరం భక్తులు స్వామివార్లను దర్శించుకున్నారు. ఆలయ నిర్వాహకులు భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు.

వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలు, రైతులు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ నిర్వహించిన ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో గవి మఠం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది.

↑