True Times Indiaనిజమైన వార్తలు — నిర్భయమైన రిపోర్టింగ్
True Times India

తాజా తెలుగు వార్తలు | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | జాతీయం

తాజా వార్తతాజా వార్తలు లోడ్ అవుతున్నాయి...

ఉరవకొండ దుర్గాభవాని దేవాలయంలో వైభవంగా శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు

ఉరవకొండ, అక్టోబర్ 7: ఉరవకొండ పట్టణంలోని శ్రీశ్రీశ్రీ దుర్గాభవాని దేవాలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలను ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నట్లు శ్రీ భవానీ భక్త మండలి, ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. పది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో ప్రతిరోజూ అమ్మవారు వివిధ విశేష అలంకారాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు.

విజయదశమి వరకు నిర్వహించే ఈ ఉత్సవాలకు భక్తుల కోసం ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొంది. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు, పూజలు, సేవలు నిర్వహించనున్నారు.

అమ్మవారి రోజువారీ అలంకారాలు

  • అక్టోబర్ 11, ఆదివారం: శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి
  • అక్టోబర్ 12, సోమవారం: శ్రీ గాయత్రీ దేవి
  • అక్టోబర్ 13, మంగళవారం: శ్రీ అన్నపూర్ణాదేవి
  • అక్టోబర్ 14, బుధవారం: శ్రీ మహా చండీ దేవి
  • అక్టోబర్ 15, గురువారం: శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి
  • అక్టోబర్ 16, శుక్రవారం: శ్రీ మహా సరస్వతి దేవి (మూలా నక్షత్రం)
  • అక్టోబర్ 17, శనివారం: శ్రీ మహాలక్ష్మి దేవి
  • అక్టోబర్ 18, ఆదివారం: శ్రీ దుర్గాదేవి (దుర్గాష్టమి)
  • అక్టోబర్ 19, సోమవారం: శ్రీ మహిషాసురమర్ధిని దేవి (మహానవమి)
  • అక్టోబర్ 20, మంగళవారం: శ్రీ రాజరాజేశ్వరీ దేవి (విజయదశమి)

భక్తులకు ఆలయ కమిటీ ఆహ్వానం

శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ, పూజలు, సేవలు చేయించుకోవాలనుకునే భక్తులు ఆలయ కమిటీ ప్రతినిధులను సంప్రదించాలని నిర్వాహకులు కోరారు.

సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు:
📞 9440154517
📞 9701567331

భక్తులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని ఆలయ కమిటీ, శ్రీ భవానీ భక్త మండలి సభ్యులు ఆహ్వానించారు.


↑