True Times Indiaనిజమైన వార్తలు — నిర్భయమైన రిపోర్టింగ్
True Times India

తాజా తెలుగు వార్తలు | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | జాతీయం

తాజా వార్తతాజా వార్తలు లోడ్ అవుతున్నాయి...

ఘనంగా అబ్దుల్ కలాం జయంతి వేడుకలు


 ఉరవకొండ పట్టణంలోని స్థానిక గవిమఠం ప్రాంగణంలో ఉన్న జమీల్ ఫర్నిచర్ షాప్ వద్ద భారతరత్న డాక్టర్ ఏ.పి.జె. అబ్దుల్ కలాం 95వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి, మిఠాయిలు పంచారు.

అబ్దుల్ కలాం జీవిత విశేషాలు

అవుల్ పకీర్ జైనులబ్ధీన్ అబ్దుల్ కలామ్ 1931 అక్టోబర్ 15న తమిళనాడులోని రామేశ్వరంలో ఒక సాధారణ తమిళ ముస్లిం కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి జైనులబ్ధీన్ పడవ యజమానిగా, తల్లి ఆషియమ్మ గృహిణిగా ఉండేరు. పేద కుటుంబం కావడంతో కుటుంబ అవసరాల నిమిత్తం కలామ్ చిన్న వయసులోనే పని చేయడం ప్రారంభించి, పాఠశాల విద్య పూర్తయిన తర్వాత తన తండ్రికి ఆర్థికంగా సహాయం అందించారు.

 * వృత్తి జీవితం: భారత రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తించడానికి ముందు, ఆయన రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO) మరియు భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO)లో ఏరోస్పేస్ ఇంజనీర్‌గా పనిచేశారు.

 * మిస్సైల్ మ్యాన్: దేశ రక్షణ రంగంలో ఆయన చేసిన అమూల్యమైన సేవలకు గాను భారతదేశపు "మిస్సైల్ మ్యాన్"గా ప్రసిద్ధి చెందారు.

 * యువ పునరుజ్జీవనోద్యమ దినోత్సవం: కలాం మరణానంతరం ఆయన పుట్టినరోజు అక్టోబర్ 15వ తేదీని తమిళనాడు ప్రభుత్వం "యువ పునరుజ్జీవనోద్యమ దినోత్సవంగా" నిర్వహిస్తోంది.

 * పురస్కారం: తమిళనాడు ప్రభుత్వం ఆయన పేరు మీద "డాక్టర్ ఎ.పి.జె. అబ్దుల్ కలాం పురస్కారం"ను ఏర్పాటు చేసింది. ఇందులో 8 గ్రాముల బంగారు పతకం, ప్రశంసాపత్రం మరియు రూ. 5,00,000 నగదును బహుకరిస్తారు. శాస్త్రీయ వృద్ధిని, మానవీయ శాస్త్రాలను మరియు విద్యార్థుల సంక్షేమాన్ని ప్రోత్సహించడంలో విశేష కృషి చేసిన రాష్ట్ర ప్రజలకు 2015 నుండి ప్రతి సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ పురస్కారాన్ని అందిస్తున్నారు.

పాల్గొన్న ప్రముఖులు

ఈ కార్యక్రమంలో పాటిల్ నిరంజన్ గౌడ్, సీనియర్ ఎలక్ట్రిషియన్ ఉక్కిసుల గోపాల్, లెనిన్, జమీల్, ముండాస్ ఓబులేసు, పోసా రాము, సోము, విశ్వనాథ్, అబ్దుల్ రెహమాన్ తదితర అభిమానులు పాల్గొన్నారు.


↑