True Times Indiaనిజమైన వార్తలు — నిర్భయమైన రిపోర్టింగ్
True Times India

తాజా తెలుగు వార్తలు | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | జాతీయం

తాజా వార్తతాజా వార్తలు లోడ్ అవుతున్నాయి...

MEO-1 విధులకు గైర్హాజరు వ్యవహారం: తప్పుడు నివేదికపై సమగ్ర విచారణ చేపట్టాలి – AIFDS డిమాండ్


 


అనంతపురం DEOకు వినతిపత్రం అందజేసిన విద్యార్థి సమాఖ్య

అనంతపురం 

ఉరవకొండ మండల విద్యాశాఖాధికారి (MEO-1) ఈశ్వరప్ప గైర్హాజరు వ్యవహారంలో ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించేలా నివేదిక ఇచ్చారనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య (AIFDS) డిమాండ్ చేసింది. ఈ మేరకు AIFDS రాష్ట్ర అధ్యక్షుడు సీఎం సిద్దు ఆధ్వర్యంలో గురువారం అనంతపురం జిల్లా విద్యాశాఖాధికారి (DEO)కి లిఖితపూర్వక వినతిపత్రం సమర్పించారు.

వివాదం నేపథ్యం ఏమిటి?

2026 జూన్ 17న MEO-1 ఈశ్వరప్ప నిర్దేశిత విధి నిర్వహణ ప్రదేశంలో లేరని, దీనికి సంబంధించి 'Google Maps' ఆస్కారపు ఫొటో ఆధారాలతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు AIFDS నాయకులు తెలిపారు. అయితే, ఈ ఫిర్యాదుపై సెప్టెంబర్ 21న MEO వివరణ ఇస్తూ.. ఆ రోజు అమిద్యాల గ్రామంలోని ఎస్సీ కాలనీ MPPS పాఠశాలను సందర్శించినట్లు పేర్కొన్నారు. ఇందుకు ఆధారంగా సదరు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు (HM) పి. నరసింహులు ఇచ్చిన లేఖను జతపరిచారు.

లేఖపై అనుమానాలు – అక్షర దోషాల వెనుక అసలు ఆంతర్యమేమిటి?

ఈ సందర్భంగా AIFDS రాష్ట్ర అధ్యక్షుడు సీఎం సిద్దు మాట్లాడుతూ, HM ఇచ్చిన లేఖపై పలు సందేహాలు వ్యక్తం చేశారు.

 * హోదా, గ్రామం పేర్లలో తప్పులు: అధికారిక లేఖలో 'MEO' పక్కన రోమన్ అంకె 'I' (వన్) ఉపయోగించడంలో స్పష్టత లేకపోవడమే కాకుండా, తాను పనిచేస్తున్న 'అమిద్యాల' గ్రామం పేరును కూడా తప్పుగా రాయడం HM బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని విమర్శించారు.

 * పదప్రయోగాల్లో స్పష్టత కరువు: లేఖలో 'దర్శించట' అనే పదప్రయోగాన్ని ప్రశ్నిస్తూ.. పాఠశాలను సందర్శించారా, తనిఖీ చేశారా లేక దర్శించారా అన్నదానిపై స్పష్టత లేదన్నారు. అలాగే 'Diary' వంటి ఆంగ్ల పదాల రాకడలోనూ అక్షర దోషాలు ఉన్నాయని ఎత్తిచూపారు.

 * స్వామిభక్తి ప్రదర్శన?: విద్యార్థులకు ఆదర్శంగా ఉండాల్సిన ప్రధానోపాధ్యాయుడు ఇలాంటి లోపభూయిష్టమైన లేఖ ఇవ్వడం వెనుక MEO-1 ఈశ్వరప్పను కాపాడే ప్రయత్నమే ఉందా? లేదా ఆ లేఖను వేరొకరు తయారుచేస్తే HM కేవలం సంతకం మాత్రమే చేశారా? అని నిలదీశారు.

AIFDS ప్రధాన డిమాండ్లు:

 * రికార్డుల పరిశీలన: జూన్ 17న పాఠశాల విజిటర్స్ రిజిస్టర్‌లో MEO సంతకం, తనిఖీ సమయం నమోదయ్యాయో లేదో తనిఖీ చేయాలి.

 * టూర్ డైరీ, పాఠశాల రికార్డులు: MEO అధికారిక టూర్ డైరీతో పాటు, ఆ రోజు పాఠశాలలో విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజన పథకం, వీక్లీ మెనూ, టీచింగ్ నోట్స్, లెసన్ ప్లాన్‌లను నిజంగానే తనిఖీ చేశారా అన్న ఆధారాలను పరిశీలించాలి.

 * స్వతంత్ర విచారణ: MEO సమర్పించిన వివరణ, HM ఇచ్చిన లేఖ, ఫిర్యాదునాటి Google Maps ఫొటో ఆధారాలను స్వతంత్ర అధికారులతో నిష్పక్షపాతంగా విచారించాలి.

"విద్యాశాఖలో అధికారుల ప్రాపకం కోసం జవాబుదారీతనాన్ని పక్కనపెడితే సహించేది లేదు. తప్పుడు సమాచారంతో ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించినట్లు తేలితే నిబంధనల ప్రకారం శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి. లేనిపక్షంలో AIFDS ఆధ్వర్యంలో పెద్దఎత్తున ప్రజాస్వామ్యయుత ఆందోళనలు చేపడతాం" అని సీఎం సిద్దు హెచ్చరించారు.


↑