ఉరవకొండ:
ఉరవకొండ పట్టణంలోని శ్రీ దుర్గా భవాని దేవాలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నవరాత్రుల మొదటి రోజున అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవిగా భక్తులకు దివ్యదర్శనమిచ్చారు. విశేషంగా అలంకరించిన అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా అమ్మవారి అలంకరణ, పూజా కార్యక్రమాలు మరియు ప్రసాద వితరణ సేవలను భక్తులు శ్రీ వేల్పుల రాము కుటుంబ సభ్యులు మరియు శ్రీ సురేంద్ర దంపతులు నిర్వహించారు.
సేవలు అందించిన దాతల కుటుంబాలకు శ్రీ దుర్గా భవాని అమ్మవారి ఆశీస్సులతో సంపూర్ణ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు కలగాలని ఆలయ కమిటీ సభ్యులు మరియు భవాని భక్తమండలి నిర్వాహకులు ఆకాంక్షించారు.

