ఉరవకొండ:
శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఉరవకొండలోని శ్రీ దుర్గా భవాని దేవాలయంలో రెండవ రోజు వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారు శ్రీ వేదమాత గాయత్రీ దేవి అలంకారంలో దివ్య మంగళ స్వరూపంతో భక్తులకు దర్శనమిచ్చారు.
రెండవ రోజు పూజా కార్యక్రమాలు మరియు ప్రత్యేక ప్రసాద వితరణ సేవలను భక్తులు బండి సురేష్, వెంకోబా రావు, నరసింహమూర్తి, అశ్వర్ధ రెడ్డి నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ... పూజల్లో పాల్గొన్న ఉభయదాతలకు, విచ్చేసిన భక్తులందరికీ శ్రీ దుర్గా భవాని అమ్మవారి కృపాకటాక్షాలతో సంపూర్ణ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, మనశ్శాంతి కలగాలని వేడుకున్నట్లు తెలిపారు. దివ్యానుభూతిని అందించారు.

