ఉరవకొండ, ప్రతినిధి: ఉరవకొండ నియోజకవర్గ ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థి బ్యాళ్ల ప్రసాద్ నామినేషన్ అధికారికంగా ఆమోదం పొందింది. ఈ సందర్భంగా ఆయన పార్టీ నాయకత్వానికి, కార్యకర్తలకు, తనకు సహకరిస్తున్న మిత్రులు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు.
పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి ఆశీస్సులతో పాటు, సీడబ్ల్యూసీ సభ్యులు నీలకంఠాపురం రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజుల సహకారం, మార్గదర్శకత్వంతో ఈ అవకాశం లభించిందని బ్యాళ్ల ప్రసాద్ పేర్కొన్నారు. జిల్లా అబ్జర్వర్, మాజీ రాజ్యసభ సభ్యుడు తులసిరెడ్డి ఆధ్వర్యంలో, జిల్లా ఇన్‌చార్జి పోటుగారి భాస్కర్ సహకారంతో, జిల్లా అధ్యక్షుడు వై. మధుసూదన్ రెడ్డి దిశానిర్దేశంలో నామినేషన్ ప్రక్రియ కొనసాగిందని తెలిపారు.


