True Times Indiaనిజమైన వార్తలు — నిర్భయమైన రిపోర్టింగ్
True Times India

తాజా తెలుగు వార్తలు | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | జాతీయం

తాజా వార్తతాజా వార్తలు లోడ్ అవుతున్నాయి...

ఆమిద్యాల మేజర్ గ్రామ పంచాయితీ రెండో ఎంపీటీసీ అభ్యర్థిగా హెచ్. దేవమ్మ నామినేషన్ దాఖలు

ఆమిద్యాల 2వ ఎంపీటీసీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా హెచ్. దేవమ్మ నామినేషన్

ఆమిద్యాల: మండల పరిధిలోని ఆమిద్యాల మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో 2వ ఎంపీటీసీ స్థానానికి తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధికారిక అభ్యర్థిగా హెచ్. దేవమ్మ పోటీ చేస్తున్నారు. ఈ మేరకు గురువారం ఆమె నామినేషన్ పత్రాలను సమర్పించారు.

పార్టీ నాయకత్వం తనకు అవకాశం కల్పించడంతో ఎన్నికల బరిలో నిలిచిన దేవమ్మ, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. పయ్యావుల సోదరుల ప్రోత్సాహంతో పార్టీ బలోపేతానికి పనిచేస్తున్నట్లు ఆమె అనుచరులు పేర్కొన్నారు.

గ్రామంలోని అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని ముందుకు సాగడం, స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వడం, గ్రామాభివృద్ధికి కృషి చేయడం తన లక్ష్యమని దేవమ్మ పేర్కొంటున్నారు. ప్రజల ఆశీర్వాదంతో ఎన్నికల్లో విజయం సాధించి ప్రజాసేవకు అంకితమవుతానని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఆమిద్యాల 2వ ఎంపీటీసీ స్థానం పరిధిలోని ఓటర్లు తనకు మద్దతు తెలిపి, ఎన్నికల్లో గెలిపించాలని హెచ్. దేవమ్మ విజ్ఞప్తి చేశారు.

↑