True Times Indiaనిజమైన వార్తలు — నిర్భయమైన రిపోర్టింగ్
True Times India

తాజా తెలుగు వార్తలు | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | జాతీయం

తాజా వార్తతాజా వార్తలు లోడ్ అవుతున్నాయి...

ఘనంగా చాబాల గ్రామంలో శ్రీ వాల్మీకి జయంత్యుత్సవాలు

  

చాబాలలో ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు

చాబాల / వజ్రకరూరు: మండలంలోని చాబాల గ్రామంలో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించి, గ్రామ ప్రజలకు అన్నదానం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆకుల వెంకటేశులు మాట్లాడుతూ.. మహర్షి వాల్మీకి సంస్కృత సాహిత్యంలో ఆదికవిగా ప్రసిద్ధి చెందారని, ప్రపంచానికి గొప్ప ఇతిహాసమైన రామాయణాన్ని అందించారని పేర్కొన్నారు. వాల్మీకి మహర్షి జీవితం పరివర్తనకు నిదర్శనమని, సంకల్పబలం, తపస్సుతో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని ఆయన వివరించారు.

రామాయణం ద్వారా శ్రీరాముడి ఆదర్శ గుణాలు, ధర్మనిష్ఠ, పితృభక్తి, సోదరప్రేమ వంటి విలువలను వాల్మీకి మహర్షి ప్రపంచానికి చాటిచెప్పారని అన్నారు. సత్యం, ధర్మం, న్యాయం ఎప్పటికీ నిలుస్తాయని ఆయన బోధనలు తెలియజేస్తాయని పేర్కొన్నారు. వాల్మీకి మహర్షి ఆశయాలు, రామాయణ సందేశం తరతరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు రామాంజనేయులు, అంగడి తిప్పయ్య, తలారి ఓబులపతి, నారాయణస్వామి, ఆకుల వెంకటేశులు, తలారి చెన్నప్ప తదితరులు పాల్గొన్నారు. గ్రామ యువకులు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకలను విజయవంతం చేశారు.

↑