True Times Indiaనిజమైన వార్తలు — నిర్భయమైన రిపోర్టింగ్
True Times India

తాజా తెలుగు వార్తలు | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | జాతీయం

తాజా వార్తతాజా వార్తలు లోడ్ అవుతున్నాయి...

ఉరవకొండ శాఖ గ్రంథాలయంలో పోటీ పరీక్షల పుస్తకాలు అందుబాటులో: గ్రంథాలయాధికారి వై. ప్రతాపరెడ్డి


 


ఉరవకొండ:

ప్రస్తుతం ప్రభుత్వం వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తున్న తరుణంలో, అభ్యర్థుల సౌకర్యార్థం ఉరవకొండ శాఖ గ్రంథాలయంలో పోటీ పరీక్షల పుస్తకాలను అందుబాటులో ఉంచినట్లు గ్రంథాలయాధికారి వై. ప్రతాపరెడ్డి తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పౌర గ్రంథాలయ శాఖ ఉమ్మడి అనంతపురం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ వడ్డే వెంకట్, కార్యదర్శి జె. శివ ప్రసాద్ ల ఆదేశాల మేరకు ఈ పుస్తకాలను సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ... నిరుద్యోగ యువత మరియు విద్యార్థులు గ్రంథాలయంలో అందుబాటులో ఉన్న పుస్తకాలను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. పోటీ పరీక్షల్లో ప్రతిభ చాటి, ఉద్యోగాలు సాధించడం ద్వారా ఉజ్జ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో రిటైర్డ్ టీచర్ హెచ్. మహబూబ్ బాషా, కే. ధనరాజ్, బి. శంకరయ్యలతో పాటు పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.


↑