True Times Indiaనిజమైన వార్తలు — నిర్భయమైన రిపోర్టింగ్
True Times India

తాజా తెలుగు వార్తలు | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | జాతీయం

తాజా వార్తతాజా వార్తలు లోడ్ అవుతున్నాయి...

వాసవి అమ్మవారికి సరస్వతీదేవి అలంకరణ

 


యాడికి, 


యాడికి మండలం వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి శరన్నవరాత్రులలో భాగంగా ఏడవ రోజు శనివారం సరస్వతీదేవి అలంకరణను ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ప్రతిరోజు మాదిరిగానే షోడశోపచార పూజలు నిర్వహించి బిందు సేవ, అక్షరాభ్యాసం, 10 సంవత్సరాల లోపు బాలికలకు కన్యకా పూజ వంటి కార్యక్రమాలు నిర్వహించారు.

నవదుర్గల నాటక ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణ

శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో తొమ్మిది మంది బాలికలు నవదుర్గల రూపంలో ముగ్గురు బాలురు రాక్షసుల రూపంలో నవదుర్గల నాటకాన్ని స్క్రిప్ట్ ను అనుసరిస్తూ అద్భుతంగా ప్రదర్శించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

అనంతరం చిన్నారులకు గంగవరం చంద్రయ్య శెట్టి కుమారుడు రాజా బహుమతులు ప్రదానం చేశారు. అలాగే వాసవి అమ్మవారికి వన్ గ్రామ్ గోల్డ్ నగలు సమర్పించారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

↑