యాడికి మండలం
వేములపాడుదసరా పండుగను పురస్కరించుకుని వేములపాడు పంచాయతీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న పారిశుధ్య కార్మికులకు దుస్తులను వేములపాడుపంచాయతీ అధికారి మహేశ్వర్ రెడ్డి, పంచాయతీ సిబ్బంది పంపిణీ చేశారు.
వేములపాడు పంచాయతీలోని 4 గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు నిరంతరం శ్రమిస్తున్న కార్మికులను గుర్తించి దుస్తులు అందించడం అభినందనీయమని పలువురు హర్షం వ్యక్తం చేశారు.

