True Times Indiaనిజమైన వార్తలు — నిర్భయమైన రిపోర్టింగ్
True Times India

తాజా తెలుగు వార్తలు | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | జాతీయం

తాజా వార్తతాజా వార్తలు లోడ్ అవుతున్నాయి...

ఢిల్లీ పర్యటనలో కేంద్ర ఆర్థిక మంత్రితో సీఎం చంద్రబాబు, పయ్యావుల కేశవ్ భేటీ

 

నిర్మలా సీతారామన్‌తో మంత్రి పయ్యావుల కేశవ్ భేటీ

న్యూఢిల్లీ, అక్టోబర్ 7: ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు ఆర్థిక, అభివృద్ధి అంశాలపై చర్చించినట్లు సమాచారం.

ప్రధానంగా గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ప్రాజెక్టు పురోగతిపై సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు జిల్లాల వారీగా చేపట్టాల్సిన కార్యాచరణ, ప్రాజెక్టు అమలుకు అవసరమైన చర్యలు, వివిధ శాఖల సమన్వయం తదితర అంశాలపై చర్చ జరిగినట్లు పేర్కొన్నారు.

గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరై, ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధ చూపినందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి పయ్యావుల కేశవ్ ధన్యవాదాలు తెలిపారు.

అలాగే ఎక్స్‌టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్టులు (EAPs) అమలుకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాలపై కూడా సమావేశంలో చర్చించినట్లు వెల్లడించారు. ఆయా ప్రాజెక్టులకు సంబంధించిన ఆర్థిక అంశాలు, కేంద్ర-రాష్ట్ర వాటాల సమన్వయం వంటి విషయాలపై అభిప్రాయాలు పంచుకున్నట్లు తెలిపారు.

రాష్ట్రంలో ఉద్యానవన రంగాన్ని మరింత అభివృద్ధి చేయడం, రైతులకు మెరుగైన మార్కెట్‌ అవకాశాలు కల్పించడం, ప్రాజెక్టుల ద్వారా పెట్టుబడులు, ఉపాధి అవకాశాలను పెంచడం వంటి అంశాల్లో గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ప్రాజెక్టు కీలకంగా ఉండనుందని ప్రభుత్వం భావిస్తోంది.

↑