ఉరవకొండ (అనంతపురం జిల్లా):"వ్యవసాయం అంటే ఒక పుట్టు కాదు... మన బతుకంతా" అనే సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతూ, సాగు రంగంలో తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం మోపిడి గ్రామానికి చెందిన దగ్గుబాటి కుటుంబం. పెన్న అహోబలం లక్ష్మీనరసింహ స్వామి దివ్య ఆశీస్సులతో, భూమితో అనుబంధాన్ని తరతరాలుగా కొనసాగిస్తూ ఈ ప్రాంతంలో వ్యవసాయానికి కొత్త అర్థాన్ని ఇస్తున్నారు.
1980ల్లోనే విప్లవాత్మక అడుగులు
ఈ ప్రాంతంలో వ్యవసాయం చేయడమే కష్టమైన రోజుల్లో, అనగా 1980 ప్రాంతంలోనే అత్యంత ఆధునిక యంత్రాలైన ట్రాక్టర్లను దిగుమతి చేసుకుని, అడవి భూములను సైతం సారవంతమైన సాగు భూములుగా మార్చిన ఘనత దగ్గుబాటి కుటుంబానికే దక్కుతుంది. ఆనాటి వారి దార్శనికత, కష్టపడే తత్వమే నేడు ఈ ప్రాంతంలో సుసంపన్నమైన పంటలు పండటానికి మూలకారణంగా నిలిచింది.
ఆధునిక సాగులో అగ్రగామి – విరివిగా పంటల దిగుబడి
నాటి సంకల్పంతో ప్రారంభమైన వీరి ప్రయాణం నేడు వైవిధ్యమైన, లాభదాయకమైన పంటల సాగుతో ముందంజలో ఉంది. ప్రస్తుతం వీరి ఆధ్వర్యంలో ప్రధానంగా:
* టమోటా
* కర్బూజా (మస్క్ మెలన్)
* దోసకాయ
* పుచ్చకాయ (కల్లంగడి)
* ఇతర రకాల పండ్లు మరియు వివిధ రకాల వాణిజ్య పంటలను అత్యంత నైపుణ్యంతో సాగు చేస్తున్నారు.
'రైతు బలమే... దేశ బలం!'
"భూమి మనది... పంటల బంధం తరతరాలది" అనే నినాదంతో సాగును కేవలం వృత్తిగానే కాక ఒక సంస్కృతిగా, మమకారంగా భావిస్తూ ముందుకు సాగుతున్నారు. దగ్గుబాటి కుటుంబం చూపుతున్న ఈ బాట, నేటి తరం రైతులకు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.

