True Times Indiaనిజమైన వార్తలు — నిర్భయమైన రిపోర్టింగ్
True Times India

తాజా తెలుగు వార్తలు | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | జాతీయం

తాజా వార్తతాజా వార్తలు లోడ్ అవుతున్నాయి...

SIR ప్రక్రియను రద్దు చేయాలి:సిద్ధూ


 10వ లోక్‌సభను జయప్రదం చేయాలి

ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి



ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశం


అనంతపురం: ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటు హక్కు రక్షణ, ప్రతి అర్హుడైన పౌరుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలనే డిమాండ్లతో ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది.


ఈ సందర్భంగా SFI, AISF, PDSU, YSRSU, AISA, DYFI, AIYF, NSUI, PSU, AIFDS, AISB, PLY, PSF, USFI, AISP తదితర విద్యార్థి, యువజన సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైన హక్కు అని అన్నారు.

 సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఓతూరు పరమేష్,ఏఐఎస్బి రాష్ట్ర అధ్యక్షులు పృద్వి, వైయస్సార్ ఎస్ యు జిల్లా ఉపాధ్యక్షుడు మంజునాథరెడ్డి, ఏఐఎస్ఎ జిల్లా కార్యదర్శి శివకుమార్,AIFDS రాష్ట్ర అధ్యక్షులు సిద్దు,పిఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ కలాం,PDSU జిల్లా అధ్యక్షుడు శంకర్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు దుర్గేష్, ఏఐఎస్ఎఫ్ నగర కార్యదర్శి శుకృత్, ఏఐఎస్పి జిల్లా కార్యదర్శి నరసింహ,USFI జిల్లా కార్యదర్శి భీమేష్, PSU జిల్లా కార్యదర్శి భాస్కర్ మాట్లాడుతూ

ప్రస్తుతం కొనసాగుతున్న SIR (Special Intensive Revision) ప్రక్రియపై అనేక అనుమానాలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని, అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించబడకుండా, ప్రతి ఓటరుకు తన పేరు జాబితాలో ఉందో లేదో తెలుసుకునే అవకాశం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఓటర్ల హక్కులకు ఎలాంటి నష్టం కలగకుండా పారదర్శకమైన విధానాన్ని అనుసరించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందన్నారు.


ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో నమ్మకం మరింత బలపడేలా ఎన్నికల సంఘం స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని నాయకులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు.


అదేవిధంగా SIR ప్రక్రియను రద్దు చేయాలని, ఓటర్ల హక్కులను కాపాడేందుకు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు.


ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం విద్యార్థులు, యువత, ప్రజలు ఐక్యంగా నిలబడి తమ ఓటు హక్కును కాపాడుకోవాలని, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత కోసం ప్రశ్నించాలని ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు పిలుపునిచ్చారు.


డిమాండ్లు:


1. ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి.

2. SIR ప్రక్రియను రద్దు చేయాలి.

3. అర్హులైన ప్రతి ఓటరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలి.

4. ఓటర్ల పేర్ల తొలగింపులో పూర్తి పారదర్శకత పాటించాలి.

5. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంచే చర్యలు చేపట్టాలి.


– ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు జిల్లా అధ్యక్షుడు తరిమెలగిరి, పి ఎస్ ఎఫ్ ప్రతిభ భారతి, ఏఐఎస్ఎ బాలకృష్ణ, నాయకులు వంశీ,మహేష్, ప్రదీప్, శామీరు, సాహిత్, ఇబ్రహీం,సిద్ధార్థ్, చిన్న తదితరులు పాల్గొన్నారు...

↑