True Times Indiaనిజమైన వార్తలు — నిర్భయమైన రిపోర్టింగ్
True Times India

తాజా తెలుగు వార్తలు | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | జాతీయం

తాజా వార్తతాజా వార్తలు లోడ్ అవుతున్నాయి...

స్టాఫ్ నర్సుల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు


 



ఉద్యోగ భద్రత, సమాన పనికి సమాన వేతనం కల్పించాలి.

పి ఎస్ యు అంతఃపురం జిల్లా కార్యదర్శి భాస్కర్ 


రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ వైద్యాశాలలో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులు తమ న్యాయమైన హక్కులు, ఉద్యోగ భద్రత, వేతన సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన ఉద్యమానికి ప్రగతిశీల విద్యార్థి సంఘం (PSU) సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నదని PSU అనంతపురం జిల్ల కార్యదర్శి G.భాస్కర్ తెలిపారు.

 అనంతపురం నగరంలో వారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కీలకమైన వైద్య సేవలను అందిస్తూ, రోగుల ప్రాణాలను కాపాడడంలో స్టాఫ్ నర్సులు అత్యంత బాధ్యతాయుతమైన పాత్ర పోషిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అలాంటి నర్సుల సమస్యలను ప్రభుత్వం, అధికారులు నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. కరోనా లాంటి సమయంలో కూడా తమ కుటుంబాలను వదిలేసి పేసెంట్లకు సేవాలాందించడంలో ముందున్నవారి సమస్యలు ప్రభుత్వం పట్టించుకోక పోవడం అన్యాయం అన్నారు. స్టాఫ్ నర్సులు వారి ప్రధాన డిమాండ్లు అయిన స్టాఫ్ నర్సులకు రెగ్యులరైజేషన్ చేయాలి.100% గ్రాస్ జీతం చెల్లించాలి. ₹50,000 ఎక్స్‌ట్రా గ్రేషియా/ప్రమాద భత్యం కల్పించాలి.EPF, పూర్తి జీతంతో మెడికల్ లీవ్, హెల్త్ కార్డులు కల్పించాలి,రిక్రూట్‌మెంట్/మ్యుటువల్ ట్రాన్స్‌ఫర్ వంటి సౌకర్యాలను కల్పించాలి.

నర్సులకు ఉద్యోగ భద్రత, పని ప్రదేశంలో రక్షణ కల్పించాలి.ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న నర్సులకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలనే వారి డిమాండ్ లను పరిష్కారం కోసం వారిని చర్చలకు పిలిచి పరిస్కారం చేయాలనీ కోరారు.నర్సులపై పనిభారం పెంచుతూ, తగిన వేతనాలు మరియు ఉద్యోగ భద్రత కల్పించకుండా పనిచేయించడం అన్యాయమని పేర్కొన్నారు.కడప రిమ్స్‌లో నర్సులు చేపట్టిన ఉద్యమాన్ని వెంటనే ప్రభుత్వం గుర్తించి, వారితో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.నర్సుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం జరిగే పోరాటంలో PSU విద్యార్థులు, యువజనులు అండగా నిలుస్తారని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే వారితో కలసి పి ఎస్ యు గా ఉద్యమం చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో PSU మండల అధ్యక్షుడు తులసీనాథ్ తెలిపారు .నాయకులు గోపి, హరిపాల్గొన్నారు.

↑