పదేళ్ల బి ఆర్ ఎస్ మోసానికి ..ఎమ్మెల్యే యశస్విని రెడ్డి చెక్
తొర్రూరు , ట్రూ టైమ్స్ ఇండియా ప్రతినిధి , నవంబర్ 17:గత పదేళ్ల టీఆర్ఎస్ పాలనలో పేదలకు కల్లబొల్లి మాటలు చెప్పి ఒక్క కొత్త పింఛను కూడా ఇవ్వకుండా నిరుపేదలను తీవ్రంగా మోసం చేశారని పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి మరియు కాంగ్రెస్ నాయకులు ఘాటుగా విమర్శించారు మంగళవారం తొర్రూరు పట్టణ కేంద్రంలోని రామా ఉపేంద్రమ్ గార్డెన్లో నిర్వహించిన కార్యక్రమంలో తొర్రూరు మండలానికి చెందిన 865 మంది మరియు తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలోని 304 మంది కలిపి మొత్తం 1,169 మంది అర్హులకు నూతన చేయూత పింఛన్ మంజూరు పత్రాలను ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అందజేశారు
అధికారం ఉన్న పదేళ్లు పేదల గోడు పట్టించుకోని బి ఆర్ ఎస్ నాయకులు నేడు ప్రజా ప్రభుత్వం పేదలకు ఇళ్లు పింఛన్లు ఇస్తుంటే ఓర్వలేక చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు మాటల ప్రభుత్వాన్ని సాగనంపి చేతల ప్రభుత్వాన్ని తెచ్చుకున్న ప్రజల నమ్మకాన్ని నిలబెడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని స్పష్టం చేశారు పదేళ్ల నిరీక్షణ తర్వాత తమకు పింఛన్లు మంజూరు కావడంపై అమ్మాపురం సహా వివిధ గ్రామాల లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో అమ్మాపురం గ్రామ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు స్థానిక ప్రజాప్రతినిధులు ముఖ్య నాయకులు కార్యకర్తలు అధికారులు మరియు లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు


