True Times Indiaనిజమైన వార్తలు — నిర్భయమైన రిపోర్టింగ్
True Times India

తాజా తెలుగు వార్తలు | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | జాతీయం

తాజా వార్తతాజా వార్తలు లోడ్ అవుతున్నాయి...

24న గవిమఠంలో కార్తీక దీపోత్సవ వేడుకలు.. గోడపత్రిక విడుదల


 

ఉరవకొండ (ట్రూ టైమ్స్ ఇండియా): కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 24వ తేదీ మంగళవారం ఉరవకొండలోని ప్రసిద్ధ శ్రీ గవిమఠం సంస్థానంలో కార్తీక దీపోత్సవం, ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకలకు సంబంధించిన గోడపత్రికను (పోస్టర్) ఆలయ ప్రాంగణంలో ఆవిష్కరించారు.

కార్యక్రమ వివరాలు:

  •    ఉదయం 5.30 నుంచి 6.00 వరకు: సుప్రభాత సేవ, అభిషేక కార్యక్రమాలు.
  •   ఉదయం 6.00 నుంచి 8.00 వరకు: స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు.
  •   సాయంత్రం 6.30 నుంచి 7.30 వరకు: భక్తిశ్రద్ధలతో కార్తీక దీపోత్సవం.
  •   అనంతరం: ప్రత్యేక పూజలు, మహా మంగళహారతి, భక్తులకు తీర్థప్రసాదాల పంపిణీ.

ఈ వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని నిర్వాహకులు కోరారు. గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమంలో దేవదాయ ధర్మదాయ శాఖ సహాయ కమిషనర్ మరియు మేనేజర్ బోయపాటి సుధారాణి, గవిమఠం ఉత్తరాధికారి బసవ రాజేంద్ర స్వామి, ప్రధాన పూజారి విరూపాక్షి, జంగమ సంక్షేమ సంఘం నాయకులు మోపిడి చంద్ర, ఆలయ సిబ్బంది పురుషోత్తం, వెంకటేశులు, రఘు తదితరులు పాల్గొన్నారు.


↑