True Times Indiaనిజమైన వార్తలు — నిర్భయమైన రిపోర్టింగ్
True Times India

తాజా తెలుగు వార్తలు | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | జాతీయం

తాజా వార్తతాజా వార్తలు లోడ్ అవుతున్నాయి...

22 సంవత్సరాలు నిర్విఘ్నంగా భక్తులు దాతల సహకారంతో అన్నదాన సేవ

 22సంవత్సరాలనుండి అయ్యప్ప స్వామి ఆలయంలో అన్నదానం.

 ఉరవకొండ ట్రూ టైమ్స్ ఇండియా నవంబర్ 24: 24.11.2026 మంగళవారం శ్రీ అయ్యప్పస్వామి దివ్యక్షేత్రం ఉరవకొండ నందు పంచాయతీ రాజ్ కార్యనిర్వహక ఇంజనీర్ శ్రీమతి కొప్పోలు వనజాక్షి & శ్రీ కొప్పోలు శంకరయ్య మరియు వీరి కుమారులు శ్రీ కొప్పోలు వికాస్,దీపక్ సహాయ సహకారాలతో శ్రీ అయ్యప్ప స్వామి భక్తులు మరియు స్వాముల అందరికీ బిక్ష కార్యక్రమం జరిగింది.

ఇదే విధంగా శ్రీ అయ్యప్ప స్వామి భక్తులు అందరూ ఈ అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ శ్రీ అయ్యప్ప స్వామి అన్నదాన సేవా సమితి అధ్యక్షులు మడకశిర పంచాయతీ రాజ్ డీఈ ఈ మీనుగ వెంకటేశులు కమిటీ సభ్యులు మీనుగ ప్రియతమ్, వెట్టి నాగమణి, ఎం ఎల్లప్ప, తొండ్లం పరుశురాముడు, ఎత్తినెట్టి వీరేష్ బాబు,మీనుండి రామాంజనేయులు కుమారులు తదితరులు తెలిపారు. మంగళ వారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పరాభవనామ సంవత్సరం కార్తీకమాసం, శుక్లపక్షం, సప్తమి నవంబర్ 16 సోమవారం రోజున అన్నదాన కార్యక్రమం ప్రారంభమై మాఘమాసం శుక్లపక్షం అష్టమి జనవరి 16వ తేదీ వరకు రెండు నెలల పాటు ప్రతిరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు కొనసాగుతుందన్నారు. ఈ అన్నదాన కార్యక్రమం 2006 నుంచి ప్రారంభమై 22 సంవత్సరాల పాటు దాతలు,భక్తుల సహకారంతో నిర్విఘ్నంగా కొనసాగుతున్నదని వివరించారు. రెండు నెలల పాటు రోజు వందలాదిమంది అయ్యప్ప స్వాములకు, స్వామివారి భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని స్వామివారి ఆశీస్సులు, భక్తుల సహకారంతో కొనసాగిస్తున్నామన్నారు. భక్తులు తమకు ప్రాధాన్యత కలిగిన తేదీ రోజున అన్నదానం చేయడానికి 5116 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని అదేవిధంగా అన్నదాన కార్యక్రమానికి సహకరించడానికి తమ వంతుగా ఆర్థిక, హార్తీక వస్తు, వంట సరుకుల రూపంలో విరాళాలు అందించడానికి మీనుగ ప్రియతమ్ 9440927915 నెంబర్ కు సంప్రదించాలని పేర్కొన్నారు.

↑