True Times Indiaనిజమైన వార్తలు — నిర్భయమైన రిపోర్టింగ్
True Times India

తాజా తెలుగు వార్తలు | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | జాతీయం

తాజా వార్తతాజా వార్తలు లోడ్ అవుతున్నాయి...

24న పెన్నహోబిలంలో ఘనంగా కార్తీక జ్వాలా దీపోత్సవం: ఈఓ రమేష్ బాబు


 

పెన్నహోబిలం:ట్రూ టైమ్స్శ్రీ  ఇండియా :లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 24వ తేదీ (మంగళవారం) ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈఓ) రమేష్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం 5:00 గంటలకు ఆలయ ఆవరణలో అత్యంత భక్తిశ్రద్ధలతో, సంప్రదాయబద్ధంగా కార్తీక జ్వాలా దీపాన్ని వెలిగించనున్నట్లు పేర్కొన్నారు.

కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉందని, ఈ పవిత్రమైన రోజున దీపారాధన చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసమని ఆయన తెలిపారు. స్వామివారి కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ జ్వాలా దీపోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు.

పెన్నహోబిలం పరిసర ప్రాంతాల ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఈ వేడుకలో పాల్గొని, స్వామివారి దివ్య ఆశీస్సులు పొందాలని ఆలయ ఈఓ రమేష్ బాబు కోరారు.


↑