అనంతపురం ట్రూ , టైమ్స్న ఇండియా నవంబర్ 13:
34 ఏళ్ల సుదీర్ఘ సేవకు తోటి హోంగార్డుల ఆత్మీయ కానుక..
అనంతపురం జిల్లా పోలీసు శాఖలో హోంగార్డుగా సుమారు 34 సంవత్సరాల పాటు అంకితభావంతో సేవలందించిన ఎస్. ఒబులేసు పదవీ విరమణ సందర్భంగా తోటి హోంగార్డులు గొప్ప మానవత్వాన్ని చాటుకున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా పరిధిలోని హోంగార్డులందరూ తమ ఒక రోజు వేతనాన్ని విరాళంగా అందించి, సమకూరిన రూ.4,95,580/- నగదును ఆయనకు ఆర్థిక సాయంగా అందజేశారు.
శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీ పి. జగదీష్, IPS గారు స్వయంగా ఈ చెక్కును పదవీ విరమణ పొందిన ఎస్. ఒబులేసుకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ పి. జగదీష్ మాట్లాడుతూ.. "పోలీసు కుటుంబంలో ఒకరికొకరు అండగా నిలవడం, కష్టసుఖాల్లో పాలుపంచుకోవడం ఎంతో అభినందనీయం. తోటి ఉద్యోగికి ఆర్థిక భరోసా కల్పించేందుకు ఒక రోజు జీతాన్ని త్యాగం చేసిన ఉమ్మడి జిల్లా హోంగార్డుల ఐక్యత, మానవీయ దృక్పథం అందరికీ ఆదర్శం" అని కొనియాడారు. 34 ఏళ్ల పాటు శాఖకు విశిష్ట సేవలందించిన ఒబులేసు, తన విశ్రాంత జీవితాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో గడపాలని ఎస్పీ ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఏ.ఆర్ డీఎస్పీ నీలకంఠేశ్వరరెడ్డి, ఆర్.ఐ పవన్ కుమార్, ఆర్.ఎస్.ఐ జాఫర్ మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

