True Times Indiaనిజమైన వార్తలు — నిర్భయమైన రిపోర్టింగ్
True Times India

తాజా తెలుగు వార్తలు | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | జాతీయం

తాజా వార్తతాజా వార్తలు లోడ్ అవుతున్నాయి...

కౌకుంట్ల లో జోరుగా జడ్పీటీసీ ప్రచారం!

కౌకుంట్లలో టీడీపీ జడ్పీటీసీ ఎన్నికల ప్రచారం జోరు

జడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకుంటాం.. టీడీపీ నాయకుల ధీమా

ఉరవకొండ, నవంబరు 1 (ట్రూ టైమ్స్ ఇండియా): రాష్ట్ర మంత్రి పయ్యావుల కేశవ్ స్వగ్రామమైన కౌకుంట్లలో ఆదివారం తెలుగుదేశం పార్టీ జడ్పీటీసీ ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా సాగింది. స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఏకగ్రీవంగా ఎన్నికైన ఇద్దరు ఎంపీటీసీ సభ్యులతో కలిసి గ్రామంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో జడ్పీటీసీ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవడం ఖాయమని నాయకులు ధీమా వ్యక్తం చేశారు.

గ్రామంలో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొంటూ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లారు. పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. స్థానికంగా పార్టీకి ఉన్న మద్దతును మరింత బలోపేతం చేసుకునే దిశగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ ప్రచార కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు చిత్రగుడి చిరంజీవి, ఏకగ్రీవంగా ఎన్నికైన ఎంపీటీసీ సభ్యురాలు సునీత, టీడీపీ సీనియర్ జిల్లా నాయకుడు టీడీ సుబ్రహ్మణ్యం, మాజీ ఎంపీటీసీ వనూర్లప్ప పాల్గొన్నారు. వీరితో పాటు మాజీ సర్పంచులు బోయ ఎర్రిస్వామి, మునుస్వామి, ప్రస్తుత సర్పంచ్ ఎల్లప్ప, మాజీ బ్యాంక్ వెంకటేష్ ప్రచారంలో భాగస్వాములయ్యారు.

అలాగే కే. భూపాల్, ఆంజనేయ ప్రసాద్, ఏ. దానప్పల ప్రభాకర్, మారెప్ప, శివరాం ఎర్రిస్వామి, మోపిడి ధనంజయ, గడ్డిగి వెంకటేష్, మంజు, డి. కొలవంట ఎర్రిస్వామి, సాంబరాయ రామాంజనేయులు, గోపాల్ సి., నాగేంద్ర, ధనంజయ, గోడిస తిప్పన్న, మోపిడి బుడ్డెప్ప, బత్తల రవి, నల్లా యెల్లప్ప (రాయలసీమ), కప్ప వెంకటేష్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

గ్రామ నాయకులు ఆవుల నారాయణ, ఆవుల రంగారెడ్డి, మహేష్ (నంగాయప్ప), మారుతి, సిద్ధప్ప, రుద్రయ్య, వమున్నూరు స్వామి (బెల్గాం), వనూర్ స్వామి (జపాన్) తదితరులు ప్రచార కార్యక్రమంలో పాల్గొని పార్టీ శ్రేణులకు మద్దతుగా నిలిచారు.

కౌకుంట్లలో నిర్వహించిన ఈ ప్రచారం ద్వారా జడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీ విజయానికి సమష్టిగా కృషి చేయాలనే సంకల్పాన్ని నాయకులు, కార్యకర్తలు వ్యక్తం చేశారు. గ్రామస్థాయిలో పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ ఎన్నికల ప్రచారాన్ని మరింత ఉధృతం చేయనున్నట్లు నాయకులు తెలిపారు.

↑